డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సీజన్లు మరొక అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం హైదరాబాద్లో ఇటీవలే గ్రాండ్ సక్సెస్ పార్టీని కూడా చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకమైన ఇంటర్వ్యూను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో బాలయ్య మాట్లాడితే పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ముఖ్యంగా ఫుడ్ విషయంలో తన భార్య వసుంధర తనని తిడుతూ ఉంటుందని తాను ఫిట్టుగా ఉండేందుకు ప్రత్యేకమైన ఫుడ్ వంటిది ఏమి తీసుకోనని వెల్లడించారు.. షూటింగ్ సమయంలో కూడా తాను ప్రొడక్షన్ ఫుడ్నే తింటానని చెప్పారు బాలయ్య.
అయితే ఈ విషయం విన్న అభిమానులు అయితే కాస్త ఆశ్చర్య పోయినప్పటికీ బాలయ్య చేస్తున్న పనికి శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తను పార్టీలకు కులాకులకు అన్నిటికీ కూడా అతీతంగా ఉంటానని తనకు అందరూ అభిమానులే అంటూ తెలియజేశారు. జీవితంలో తాను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది అభిమానులే అంటూ బాలయ్య తెలియజేశారు. బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రాజకీయాలు వేరు అభిమానులు వేరని బాలయ్య చెప్పిన ఒక్క డైలాగుతో బాలయ్య పైన అభిమానం మరింత పెరిగిపోయిందని పలువురు నెటిజెన్స్ అభిమానులకు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తూ ఉన్న మరి కొంతమంది స్టేజ్ పైన కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారని విధంగా నెటీజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.