టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఆ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14.వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో విడుదల రోజు నుండి ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ దక్కుతుంది. తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో ఒక అదిరిపోయే రేర్ మార్క్ కలెక్షన్లను టచ్ చేసింది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మేకర్స్ విడుదల చేశారు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికాలో 2 ప్లస్ మిలియన్ కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ టాక్ రావడంతో మరికొన్ని రోజులు ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: