ఆ నిర్మాత సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు విలన్ గా కూడా నటించాడని అంజలి నాయర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ప్రపోజల్ ను నేను తిరస్కరించడంతో నేను వేరే సినిమా సెట్స్ కు వెళ్లిన సమయంలో నన్ను వేధింపులకు గురి చేయడం జరిగిందని అంజలి నాయర్ చెప్పుకొచ్చారు. నేను రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ నిర్మాత అకస్మాత్తుగా వచ్చి నా బ్యాగ్ తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
నేను రైలు డోర్ దగ్గర నిలబడిన సమయంలో ఆ వ్యక్తి నన్ను రైలు నుంచి బయటకు నెట్టేయాలని చూశాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ వ్యక్తి సోదరి కాల్ చేసి తన తల్లి నన్ను చూడాలని కోరుతోందని మా బ్రదర్ స్విట్జర్లాండ్ కు వెళ్లాడని చెప్పిందని అంజలి నాయర్ వెల్లడించారు. ఆ సమయంలో ఆ వ్యక్తి కత్తితో బెదిరించి నాతో సంతకం చేయించుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.
లవ్ లెటర్ తో పాటు తర్వాత సినిమాలో నటించాలనే కాంట్రాక్ట్ పై సంతకం చేయించుకున్నారని అంజలి అన్నారు. ఆ కేసులో నాకు అనుకూలంగా తీర్పు వచ్చిందని అంజలి నాయర్ పేర్కొన్నారు. 2011 సంవత్సరంలో దర్శకుడు అనీశ్ తో అంజలి పెళ్లి జరిగింది. 2016 సంవత్సరంలో అతడికి విడాకులు ఇచ్చింది. 2022 సంవత్సరంలో ఆమె అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు ఒక కూతురు పుట్టింది. అంజలి నాయర్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.