ఈ వ్యూహం దిల్ రాజ్ కు బాగా కలిసి వచ్చింది అంటున్నారు. ముందుగా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ కలక్షన్స్ బాగా వచ్చాయి. ఆతరువాత ఈమూవీ కలక్షన్స్ బాగా డ్రాప్ అయినప్పటికీ దిల్ రాజ్ కూడ ఊహించని స్థాయిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఈమూవీ బయ్యర్లకు విపరీతమైన లాభాలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కనిపిస్తోంది అని అంటున్నారు. ‘గేమ్ ఛేంజర్’ కొనుక్కున్న రెగ్యులర్ బయ్యర్లకు దిల్ రాజ్ సంక్రాంతికి వస్తున్నాం రైట్స్ అమ్మినట్లు సమాచారం. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఆమూవీ పై వచ్చిన లాభాలు చాలావరకు ‘గేమ్ ఛేంజర్’ నష్టాలను పూడుస్తాయి అని అంటున్నారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ ఓవర్సీస్ రైట్స్ కొనుక్కున్న బయ్యర్ కు మాత్రం అత్యంత భారీ నష్టాలు రావడంతో అలాంటి నష్టాలు వచ్చిన కొందరు బయ్యర్లకు దిల్ రాజ్ వారి నష్టాలలో కొంతవరకు తీరుస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా దిల్ రాజ్ తనకున్న అనుభవంతో చాల వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో ‘గేమ్ ఛేంజర్’ నష్టాల నుండి చాలవరకు దిల్ రాజ్ బయటపడినట్లే అని అంటున్నారు. ఇక సంక్రాంతి రేస్ లో మరొక సినిమాగా విడుదలైన ‘డాకు మహారాజ్’ టాక్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ బిసి సెంటర్లలో ఈమూవీకి మంచి క్రేజ్ ఏర్పడటంతో ఈ ప్రాజెక్ట్ వల్ల కూడ దిల్ రాజ్ నష్టపోలేదు అన్న వార్తలు వస్తున్నాయి..