సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాల పాటు అలా కెరియర్ను కొనసాగించి డిస్ట్రిబ్యూటర్ గా మంచి స్థాయికి చేరుకున్న తర్వాత నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో ఎక్కువ శాతం కొత్త దర్శకులతో సినిమాలను రూపొందిస్తూ వచ్చాడు.

అలా కొత్త దర్శకులతో ఈయన తీసిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా దిల్ రాజు కి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ఈయన నాగ చైతన్య హీరో గా జోష్ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. వాసు వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా గురించి దిల్ రాజు ఒత్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు. అసలు విషయం లోకి వెళితే ... జోష్ మూవీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత దానిని రామ్ చరణ్ తో చేయాలి అనుకున్నాం. అందులో భాగంగా చిరంజీవి గారిని కలిసి కథను వివరించాము. దానితో చిరంజీవి పెద్దగా రియాక్ట్ కాలేదు. కొంత కాలం తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేసి సినిమా కథలో ఏదో తేడా కొడుతుంది.

అది చరణ్ పై అసలు వర్కౌట్ కాదు అనిపిస్తుంది. వేరే వారితో చేసుకోవాలి అంటే మీ ఇష్టం అని అన్నాడు. దాని తర్వాత నేను కథను చాలా మంది కి వినిపించాను. వారంతా స్టోరీ సూపర్ గా ఉంది. బ్లాక్ బాస్టర్ పక్కా అన్నారు. ఇక ఆ తర్వాత నేను ఆ కథను నాగార్జునకు వినిపించగా ఆయన నాగచైతన్యతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ సినిమా విడుదల అయ్యాక చిరంజీవి గారు చెప్పినట్టు ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆయన డిసిజన్ సూపర్ ... అందుకే మెగాస్టార్ అయ్యాడు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: