గతంలో నందమూరి బాలయ్య సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో ఒకటే ఫీలింగ్ రొట్ట కొట్టుడు కథ, డైలాగ్స్, పేళవమైన స్క్రీన్ ప్లే అదే రొటీన్ సినిమా అని ఫీల్ అయ్యేవారు.. కానీ గత కొన్నేళ్లుగా బాలయ్య లో చాలా మార్పులు వచ్చాయి..గతంలో ఒక్క అడ్వర్టైజ్ మెంట్ లో కూడా నటించని బాలయ్య ఇప్పుడు ఏకంగా ఓ బిగ్గెస్ట్ టాక్ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు.. అన్ స్టాప్పబుల్ షో లో బాలయ్య సూపర్ ఎనర్జీ తో హోస్టింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు.. ఇప్పటికే మూడు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా నాలుగో సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది..బోయపాటి తెరకెక్కించిన అఖండ సినిమాతో బాలయ్య తిరుగులేని విజయం అందుకున్నారు.. కరోనా కారణంగా ప్రేక్షకులు థియేటర్స్ రావడానికే భయపడుతున్న సమయంలో రిలీజ్ అయిన “అఖండ” భారీ వసూళ్లు సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో బాలయ్య ఫేట్ మారింది.. వరుస సూపర్ హిట్స్ లభించాయి..

ఆ తరువాత వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు బాలయ్య 12 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు.. ఆ సినిమా మంచి విజయం సాధించింది..అలాగే అనిల్ రావిపూడి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి సినిమాకు బాలయ్య ఏకంగా 18 కోట్ల రూపాయలు పారితోషికం  అందుకున్నట్లు తెలుస్తుంది..కాగా తాజాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ మూవీకి బాలయ్య ఏకంగా 27 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నాడు అని సమాచారం. తాజాగా తెరకెక్కుతున్న “అఖండ2” సినిమాకు బాలయ్య ఏకంగా 35 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.ఈ ఐదేళ్లలో బాలయ్య పారితోషికం 5 రెట్లు పెరిగిందని.. బాలయ్య కెరీర్ లో ఇక వరుస బ్లాక్ బస్టర్స్ ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: