తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో బాలయ్య , వెంకటేష్ , రామ్ చరణ్ ముందు వరసలో ఉంటారు. వీరు నటించిన అనేక సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అయ్యాయి. ఇకపోతే 2019 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ్ విధేయ రామ , బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు , వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 2 సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూవీలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి.

ఇకపోతే వినయ్ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా ... ఎఫ్ 2 సినిమా మాత్రం ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకొని ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇకపోతే 2019 వ సంవత్సరం సంక్రాంతి తర్వాత బాలకృష్ణ , రామ్ చరణ్ , వెంకటేష్ ముగ్గురు హీరోలుగా రూపొందిన సినిమాలు ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. దానితో 2019 వ సంవత్సరం సెంటిమెంట్ రిపీట్ అయితే వెంకీ కి తప్ప ఎవరికి విజయాలు రావు అనే అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్త పరిచారు. ఇకపోతే ఇప్పటికే రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ , బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి.

ఈ మూడు సినిమాలలో రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాకు మాత్రమే నెగిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య హీరో గా రూపొందిన డాకు మహారాజ్ సినిమాకు మంచి టాక్ రాగా , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో 2019 వ సంవత్సరం సెంటిమెంట్ కేవలం రామ్ చరణ్ కు మాత్రమే వర్తించింది అని బాలయ్య ఆ సెంటిమెంట్ నుండి ఎస్కేప్ అయ్యాడు అనే అభిప్రాయాలను కొంత మంది జనాలు వ్యక్త పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: