ఒకప్పటి నటి సంఘవి అంటే ఇప్పటి ప్రేక్షకులకు కూడా తెలిసిన.. ఈ హీరోయిన్ 2000 సంవత్సరం నుండి తన హవా కొనసాగింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అయితే గుర్తుపట్టకుండా మారిపోయింది. ముందే కాస్త బొద్దుగా ఉన్న సంఘవి ప్రస్తుతం మరింత బొద్దుగా మారిపోయింది. ఈమెకు ఒక పాప కూడా ఉంది.అయితే గతంలో తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ తలపతి సంఘవిని ప్రేమించారని, కానీ సంఘవి మాత్రం వేరే అబ్బాయిని ప్రేమించి విజయ్ ప్రేమను రిజెక్ట్ చేసిందనే టాక్ వినిపించింది. ఇక సంఘవి విజయ్ కాంబినేషన్లో అప్పట్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.ఈ విషయం పక్కన పెడితే .. సంఘవిని ఓ హీరో నమ్మించి మోసం చేశారట.అర్ధరాత్రి ఆ హీరో చేసిన పనికి చాలా బాధపడిందట.మరి ఇంతకీ సంఘవిని మోసం చేసిన ఆ హీరో ఎవరయ్యా అంటే బబ్లూ పృథ్వీరాజ్..

 పెళ్లి సినిమాలో హీరోయిన్ మహేశ్వరి మొదటి భర్త పాత్రలో నటించిన బబ్లూ పృథ్వీరాజ్ ఈ సినిమాతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీ రోల్స్ కూడా పోషించారు. అయితే అలాంటి బబ్లూ 57 ఏళ్ల వయసులో తనకంటే వయసులో చాలా చిన్నదైనా 24 ఏళ్ల శీతల్ ని ప్రేమించి డేటింగ్ చేశాడు. అయితే ఈమెను పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వినిపించాయి. కాని సడన్ గా వీరిద్దరూ తమ రిలేషన్ ని బ్రేక్ చేశారు. బబ్లుతో విడిపోయానంటూ శీతల్ చెప్పడంతో చాలామంది షాక్ అయిపోయారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..బబ్లూ పృథ్వీరాజ్ సంఘవిని దారుణంగా మోసం చేశారట. ఓరోజు సంఘవి షూటింగ్ ముగించుకొని వస్తున్న సమయంలో పృథ్వీరాజ్ ఎదురుపడి నాకు చాలా బాధగా ఉంది.నా వైఫ్ ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం వీళ్లు నా భార్య కోసం కేక్ కూడా కొనివ్వడం లేదు అని అన్నారట.

 అయితే ఆయన మాటలు విన్న సంఘవి వెంటనే బేకరీ కి వెళ్లి కేక్ రెడీ చేయించుకుని తీసుకువచ్చి పృథ్వీరాజ్ కి ఇచ్చిందట. ఆ తర్వాత ఓ రోజు ఎయిర్ పోర్ట్ లో పృథ్వీరాజ్ తన భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో సంఘవి చూసి పృథ్వి రాజ్ భార్యను మీకు ఇప్పుడు ఎన్నో నెల అని అడిగిందట.దానికి పృథ్విరాజ్ భార్య అదేంటి అన్నట్లుగా ఫేస్ పెట్టడంతో సంఘవికి అప్పుడు అసలు విషయం అర్థమైందట.పృథ్వీరాజ్ భార్య ప్రెగ్నెంట్ కాదని,తనని అర్ధరాత్రి మోసం చేసి కేక్ తీసుకువెళ్లాడని గ్రహించి పెద్ద చీటర్ అనుకుందట.అయితే సంఘవి మాటలకు అక్కడే ఉన్న నటి మహేశ్వరి బహుశా పృథ్వీరాజ్ ప్రెగ్నెంట్ కావచ్చు అంటూ అనడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు.అలా తన వైఫ్ ప్రెగ్నెంట్ అని  చెప్పి కేక్ తెప్పించుకొని పృథ్వీరాజ్ తనని మోసం చేసినట్టు సంఘవి చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: