మెగాస్టార్ చిరంజీవి - జూనియర్ ఎన్టీఆర్ ల కాంబోలో సినిమా రావాల్సి ఉంది . కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు. అదేవిధంగా చిరంజీవి కూడా రిజెక్ట్ చేశాడు . ఆ సినిమా మరేదో కాదు "ఊపిరి". వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున హీరో గా మరోక హీరో గా కోలీవుడ్ హీరో కార్తీ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . ఈ సినిమా కాన్సెప్ట్ కొంత మంది జనాలకి నచ్చకపోయినా.. మరికొంత మందికి మాత్రం బాగా నచ్చేసింది.
ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. శ్రేయ శరణ్ కీలకపాత్రలో మెప్పించింది . అయితే ఈ సినిమాలో మొదటిగా చిరంజీవి ఎన్టీఆర్ ను అనుకున్నారట. వంశీ పైడిపల్లి ఇద్దరికీ కథ వివరించగా.. ఇద్దరు రిజెక్ట్ చేసారట . స్టార్ హీరోలు ఈ విధంగా నటిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అన్న కారణంగానే ఈ సినిమాను అటు చిరంజీవి..అటు తారక్ ఇద్దరు రిజెక్ట్ చేశారట. అలా వీళ్ల కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయినట్లు అయింది. ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం వేరే లెవెల్ . సినిమా ఇండస్ట్రీ లెక్కలు మొత్తం మారిపోయి ఉండేటివి . జస్ట్ మిస్ .చూద్దాం మరి వీళ్ళ కాంబోలో ఎప్పుడు సినిమా వస్తుందో..??