ఆ వీడియోలో రాక్ ముఖమంతా ముదురు రంగు లిప్‌స్టిక్‌తో, మెడలో గీసిన నెక్లెస్ తో, ఒళ్లంతా మెరిసే గ్లిట్టర్‌తో దర్శనమిచ్చాడు. అంతటితో ఆగకుండా, అతని నున్నటి గుండుపై రంగురంగుల స్టిక్కర్లను అతికించి, బుగ్గలకు చిత్రవిచిత్రమైన రంగులు వేశారు. చివరగా ఎర్రటి దిద్దులను కూడా పెట్టడంతో రాక్ రూపం పూర్తిగా మారిపోయింది. ఈ సందడిలో రాక్ మాత్రం నవ్వుతూ కూర్చున్నాడు. వీడియో చివర్లో "నాకేం జరిగిందో అర్థం కావడం లేదు" అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.
ఈ సరదా మేకోవర్ ఎలా మొదలైందో రాక్ వివరించాడు. తన కూతుళ్లు "డాడీ, నీకు కొంచెం ఐషాడో వేయొచ్చా?" అని అడిగారట. దీనికి రాక్ "సరే కానీ తొందరగా, కూల్‌గా వెయ్యండి. నేను జిమ్‌కు వెళ్లాలి" అని ఒప్పుకున్నాడు. అంతేకాదు, తన కూతుళ్లు పెద్దయ్యాక తనతో గడపడానికి ఇష్టపడకపోవచ్చని తెలిసినా, "నేను ఈ టార్చర్ రోజంతా భరిస్తాను, రండి చూసుకుందాం" అంటూ కూతుళ్లపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
రాక్ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఇప్పటికే 8 లక్షల 47 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్ "నా కూతుళ్లు కూడా నాకు చాలాసార్లు మేకోవర్ చేశారు. ఒకసారి అయితే నేను వేర్వేరు రంగుల గోళ్లతో ఆఫీసుకు వెళ్లాను. ఈ సమయాన్ని ఆస్వాదించండి" అని కామెంట్ చేశాడు. మరొకరు "మీరు ఇలాగే జిమ్‌కు వెళ్లారా?" అని సరదాగా ప్రశ్నించారు. ఇంకొకరు తమ నాన్న గోళ్లకు లక్క వేసుకున్నప్పటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ "చివరికి ఆ మేకప్ పోయిందా?" అని అడిగారు.