తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే తారక్ కెరియర్లో ఓ ఇద్దరు దర్శకులను చాలా బాగా నమ్మాడు. కానీ ఆ దర్శకుల వల్ల ఆయనకు అపజయాలు దక్కాయి. అసలు విషయం లోకి వెళితే ... జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి బి గోపాల్ దర్శకత్వంలో అల్లరి రాముడు అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకుడికి మరో అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా బి గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ తో తన రెండవ ప్రయత్నంగా నరసింహుడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ భారీ డిజాస్టర్ ను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అశోక్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి కి తారక్ మరో అవకాశం ఇచ్చాడు. దానితో సురేందర్ రెడ్డి , తారక్ తో తన రెండవ ప్రయత్నంగా ఊసరవెల్లి అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాకు ఆ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: