ఒకానొక టైమ్‌లో అంటే 43వ రోజు కలెక్షన్లు కాస్త డల్ అయ్యాయి. కేవలం రూ.65 లక్షలకు పడిపోయాయి. కానీ 'పుష్ప 2: రీలోడెడ్' రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టారు. టికెట్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' లాంటి కొత్త సినిమాలు కూడా పుష్ప దెబ్బకు పతనమయ్యాయి. పుష్ప రాజ్ మ్యాజిక్‌ను మళ్లీ ఆస్వాదించారు జనాలు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అని మరోసారి ప్రూవ్ అయింది.
నిజానికి 'పుష్ప 2: రీలోడెడ్'ను జనవరి 17న మళ్లీ రిలీజ్ చేశారు. విడుదలైన మొదటి రోజు కాస్త తక్కువగా ఉన్నా.. శనివారం మాత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. హైదరాబాద్‌లో అయితే థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. సిటీతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా చోట్ల ఇదే పరిస్థితి. అదనంగా యాడ్ చేసిన 20 నిమిషాల ఫుటేజీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కథలో చాలా విషయాలు క్లియర్‌గా అర్థమయ్యేలా ఉన్నాయంటున్నారు. ఇంతకుముందు పుష్ప కంటైనర్‌లో విదేశాలకు వెళ్లే సీన్ అంతగా క్లారిటీగా లేదు. కానీ ఇప్పుడు 'పుష్ప 2 రీలోడెడ్'లో ఆ సీన్‌ను పూర్తిగా చూపించారు.
ఈ రీలోడెడ్ వెర్షన్‌లో స్టైలిష్ స్టార్ చెప్పిన కొన్ని పవర్ ఫుల్ డైలాగులు, పంచ్ లైన్స్ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేసాయి డైరెక్టర్ సుకుమార్ నిజానికి దాదాపు ఐదు గంటల ఫుటేజీని షూట్ చేశారట. అందులోంచి కొన్ని ముఖ్యమైన సీన్లను ఈ ఎక్స్‌టెండెడ్ కట్‌లో యాడ్ చేశారు.
పుష్ప 2: ది రూల్ వరల్డ్ వైడ్ గా రూ.1850 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హిందీలో అయితే ఈ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. అక్కడ కూడా టాప్ గ్రాసింగ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇది మాత్రమే కాదు, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది. జనవరి 2025 చివరి నాటికి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.