హిందీ సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కంగనా రనౌత్ ఒకరు. ఈమె ఏ విషయం పైనా అయినా చాలా గట్టిగా స్పందిస్తూ ఉంటుంది. దానితో అనేక సందర్భాలలో ఈమె అనేక విషయాలు స్పందించి ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కంగనా కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే తెలుగు సినిమాలో నటించి ఈ మూవీ ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె రాజకీయాల్లోకి కూడా ప్రవేశించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈమె బీ జే పీ పార్టీ నుండి కొంత కాలం క్రితం ముగిసిన ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని రాజకీయంగా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా కంగనా "ఎమర్జెన్సీ" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ , శ్రేయస్ తల్పాడే , మిలింద్ సోమన్ , మహిమా చౌదరి , అధిర్ భట్ ,  విశాఖ్ నాయర్ ముఖ్య పాత్రలలో నటించారు.

సినిమా అనేక వివాదాల అనంతరం తాజాగా థియేటర్లలో విడుదల అయింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఈ మూవీలో చూపించడం జరిగింది. ఇకపోతే ఎన్నో వివాదాలు అనంతరం తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి మొదటి రోజు 2.35 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కి ఇలా మొదటి రోజు అద్భుతమైన కలక్షన్లు వచ్చినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: