సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన టాలీవుడ్ యాక్షన్ డ్రామా చిత్రం పుష్ప-2 ఈ మూవీ డిసెంబర్-2024లో విడుదలైంది. అయితే ఈ చిత్రం 'పుష్ప' సిరీస్‌లోని రెండవ భాగం,పుష్ప మూవీ కీ సీక్వెల్‌గా రూపొందింది.అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖులు నటించారు. రీసెంట్ గా ఈ మూవీలో 20నిమిషాల సీన్స్ రీ లోడ్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.అయితే మేకర్స్ మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ రెండువేలకోట్ల దిశగా రాబట్టడమే లక్ష్యం అని అన్నారు.
అయితే గతంలో అల్లు అర్జున్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అప్పటికే కొరటాల ఎన్టీఆర్తో దేవర అలాగే అల్లుఅర్జున్ సుకుమార్ తో పుష్ప-2 లో బిజీగా ఉన్నారు. దాంతో విరిద్దరి కాంబో పట్టాలెక్కలేదు. అయితే ఇటీవలే ఓ కథను అల్లు అర్జున్‌కి చెప్తే దానికీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.అయితే ఆ మూవీ మొత్తం యూపీ బ్యాక్ డ్రాప్‌లో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుందని సమాచారం.ప్రస్తుతం అల్లుఅర్జున్తో సినిమాలు చేద్దామని దాదాపు ముగ్గురు డైరెక్టర్స్ లైన్లో ఉన్నారని మరి వారందరిని కాదని కొరటాలకు ఓకే చెప్తారా లేదా అనేది మాత్రం ఇంకా తేలీయలేదు.కాకపోతే పుష్ప-2 భారీ విజయాన్ని అందుకున్న అల్లుఅర్జున్ మాత్రం ఆ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించినట్లు లేరని తెలుస్తుంది దానికి కారణం సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ ప్రధాన కారణం.ఏదేమైనా అల్లు అర్జున్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇంకా అధికారికంగా ఎక్కడా స్పష్టత లేదు.