మాజీ మంత్రి దివంగత నాయకుడు అయిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య సంబంధించి ఎన్నో చిత్రాలు ఇప్పటికీ విడుదల అవుతూనే ఉన్నాయి. కానీ ఈయన మర్డర్ మిస్టరీ పైన మాత్రం ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం అధికారులు తీర్చలేక పోతున్నారు. 2024 ఎన్నికల ముందు చాలా చిత్రాలను సైతం కొంతమంది తెరకెక్కించినప్పటికీ అవి ఎన్నికల పరంగా చాలామందికి చాలా పార్టీలకు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మళ్లీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి హత్య అనే సినిమాని తెరకెక్కించారు.



గత కొద్ది రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్ , టిజర్ వంటివి వైరల్ గా మారాయి.. తాజాగా ట్రైలర్ను సైతం మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ ట్రైలర్లో వైఎస్ వివేక రాజకీయ కుటుంబ నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హత్యకు ముందు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో చిత్రీకరించినట్లు ట్రైలర్లు అయితే చూపించారు. ఈ చిత్రాన్ని ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవిద్య బసవ దర్శకత్వంలో తెరకెక్కించారు.


ఎస్ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాని నిర్మించగా ధన్య బాలకృష్ణ, రవి వర్మ, బిందు చంద్రమౌళి, రఘునాథ్ రాజు, శివాజీ తదితరునటీనటులు ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. ట్రైలర్ 15 మార్చి 2019 ఇల్లెందుల వాటితో మొదలవుతుంది.. సారు ఎంత కొట్టినా తలుపు తీవలేదు ఆ బెడ్ రూమ్ దగ్గరకు పోయి కిటికీ తలుపు కొట్టి చూడు అనే డైలాగ్ తో మొదలవుతుంది. ఆ వెంటనే రక్తపు మడుగులలో నుంచి  ఒక డెడ్ బాడీని చూపించడం జరిగింది. ఇక తర్వాత పోలీస్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఇతరత్రా సంఘటనలను చూపించారు. మరి ఈ సినిమా విడుదల సమయంలో ఎలాంటి రాజకీయాలను ఎదుర్కొంటుంది లేకపోతే ఏం జరుగుతుందనే విషయం తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: