సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది అంటే ఆ సినిమాకు సంబంధించిన వారు పార్టీలు ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. తాజాగా విక్టరీ వెంకటేష్ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల విడుదల అయ్యి విడుదల యిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఐశ్వర్య రాజేష్ ఇప్పటి వరకు చాలా తెలుగు సినిమాల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇకపోతే ఈమెకు సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం దక్కడంతో ఈమె ప్రత్యేకంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ యూనిట్ కి చెన్నై లో మంచి సక్సెస్ పార్టీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సక్సెస్ పార్టీకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ కి సంబంధించిన అనేక మంది అటెండ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: