సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి మొదటి సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ వచ్చిన ఆ తర్వాత మాత్రం వారు ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోనే కనబడకుండా పోతారు . ఇకపోతే పైన ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె సిద్ధార్థ్ హీరోగా జెనీలియా హీరోయిన్గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ్ తో పెళ్లి కుదిరి నిశ్చితార్థం కూ డా అయ్యాక కొన్ని కారణాల వల్ల వీరి పెళ్లి సంబంధం క్యాన్సల్ అవుతుంది . ఇక ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో కాస్త సమయం మాత్రమే కనిపించిన తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమా కంటే ముందు ఈమె పలు సినిమాలలో నటించింది. నేహా తెలుగులో నితిన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దిల్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అతడే ఒక సైన్యం , దుబాయ్ శీను , బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించింది. నితిన్ హీరో గా రూపొందిన దిల్ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఎందుకో ఏమో తెలియదు కానీ ఈమెకు భారీ ఉన్న సినిమాల్లో అవకాశాలు దక్కలేదు.

ఇది ఇలా ఉంటే బొమ్మరిల్లు సినిమా తర్వాత ఈమె ఎక్కువ తెలుగు సినిమాల్లో నటించలేదు. నేహా ఈ మధ్య కాలంలో సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా పలకరించకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులతో బాగా టచ్ లో ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: