అయితే ఈ హీరోయిన్ మాత్రం ఆ పిల్లోడు చేసిన పనికి షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళ సరిగమ షోలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ షోలో హీరోయిన్ కాయాదు లోహర్ ఎంట్రీ ఇవ్వక ఆమెకు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైనట్టు కనిపిస్తోంది. షో జరుగుతూ ఉండగా ఒక పిల్లవాడు ఆమె దగ్గరికి వచ్చి ఆమెను హత్తుకుని లిప్ లాక్ పెట్టేందుకు ప్రయత్నించగా ఆ హీరోయిన్ మాత్రం అందుకు నిరాకరించింది.. దీంతో షో మొత్తం ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లినట్లుగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో నేటిజన్ సైతం ఫైర్ అవుతున్నారు. పిల్లాడి ప్రవర్తనను తల్లితండ్రులు సీరియస్గా తీసుకోవాలి అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. చిన్న వయసులోనే కంట్రోల్ చేయాలని లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ పలు రకాలుగా నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..మరి కొంతమంది మాత్రం టిఆర్పి రేటింగ్ కోసం ఇలాంటి అస్లీలతను ప్రోత్సహించకూడదు పలు రకాల చానల్స్ కూడా ఇలాంటి విషయాల పైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం తెగ హల్చల్ చేస్తోంది. మరి ఈ విషయం పైన అటు ఆ హీరోయిన్ ఎలా స్పందిస్తుంది అనే విషయం తెలియాల్సి ఉన్నది.