కాగా ఇప్పటికే రియాలిటీ షోస్ కోసం కొంతమంది స్టార్ హీరోస్ హోస్ట్ గా అవతారం ఎత్తారు. జూనియర్ ఎన్టీఆర్ ..నాని .. రానా దగ్గుబాటి.. నాగార్జున.. బాలయ్య ఇలా తమలోని టాలెంట్ ని బయటపెడుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి రాబోతున్నాడు విక్టరీ వెంకటేష్ అంటూ ఓ వార్త బాగా హల్చల్ చేస్తుంది. రీసెంట్ గానే "సంక్రాతికి వస్తున్నాం" సినిమా తో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..త్వరలోనే ఓటిటి షోలో టెలికాస్ట్ కాబోతున్న ఓ టాక్ షో కోసం వెంకటేష్ ని అప్రోచ్ అయ్యారట టీం.
అయితే వెంకటేష్ కూడా అందుకు ఓకే చెప్పారట . ఇప్పుడు అందరూ కూడా తమలోని హోస్ట్ యాంగిల్ ని బయటపెడుతున్నారు . ఆ కారణంగానే వెంకటేష్ సైతం ఈ నిర్ణయం తీసుకున్నారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . అయితే ఆల్రెడీ బాలయ్య ఇప్పుడు ఆహాలో అన్ స్టాపబుల్ అంటూ ఓ టాక్ షోని నిర్వహిస్తున్నారు. దీనికి పోటీగానే మరొక బిగ్ ఓటిటి ప్లాట్ఫారం వెంకటేష్ ని చూస్ చేసుకుంది అన్న వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి . మొత్తానికి ఇన్నాళ్లు ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్.. ఇప్పుడు హోస్ట్ గా కూడా తనదైన స్టైల్ లో మెప్పించబోతున్నాడు అంటూ జనాలు ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు..!