మహేష్ బాబు - నమ్రతల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనేలేదు . ఆదర్శ దంపతులు . చాలామంది ఈ మాటలు అంటూ ఉంటారు . నమ్రత శిరోద్కర్ - మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అఫ్ కోర్స్ అటుపక్కన పెద్దవాళ్ళు ఇటు పక్కన పెద్దవాళ్ళు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు . కానీ వాళ్ళ ప్రేమ నిజమైనది అంటూ ప్రూవ్ చేసుకోవడానికి చాలా తంటాలే పడ్డారు . ఫైనల్లీ ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకునేది చేసుకునేదే అంటూ పెళ్లి కూడా చేసుకున్నారు . కుటుంబ సభ్యులకి ఇష్టం లేకుండానే ఈ పెళ్లిలో పాల్గొన్నారు.


కాగా ఇప్పుడు మహేష్ బాబు - నమ్రత ఎంత టాప్ పొజిషన్లో ఉన్నారో అందరికీ తెలుసు . పెళ్లి తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ కూడా సూపర్ సక్సెస్ అయింది . కెరియర్ ప్రకారంగా కూడా మహేష్ బాబు ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయిలోనే రికార్డ్స్ బ్రేక్ చేసే విధంగా మారిపోయాడు . అయితే వీళ్ళిద్దరికీ మాత్రం గొడవ వచ్చేది పిల్లల కారణంగానే అంటూ ఓ విషయం బయటకు వచ్చింది.  మహేష్ బాబు పిల్లలని గారాభంగా పెంచుతారు . అయితే నమ్రత మాత్రం అలా కాకుండా ప్రతి రూపాయి  విలువ వాళ్లకు తెలిసే పెంచుతుందట.



కష్టపడితేనే డబ్బులు మన చేతికి వస్తాయి అని.. ఆ కష్టం విలువ వాళ్లకు తెలియాలి అనే విధంగా పెంచుతుందట. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని బాగా దుబారా చేస్తే రేపటి రోజు వాళ్ళకి ఆ క్ష్టం కారణంగా వచ్చిన రూపాయి విలువ తెలియదు అని ఎప్పుడు చెప్పుతూనే ఉంటుందట.  ఈ కారణంగానే మహేష్ బాబుకు - నమ్రతకు ప్రతిసారి గొడవలు వస్తాయత. పిల్లల పెంపకం విషయంలోనే వీళ్ళకి ఎక్కువగా గొడవలు వస్తాయని మిగతా ఏ విషయం కారణంగా వీళ్ళకి పెద్దగా గొడవలు రావు అంటూ  ఓ విషయం బయటపడింది . దీంతో మహేష్ - నమ్రత కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ని ఫాలో అవుతున్నారు అని.. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోనూ ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి అని .. మహేష్ - నమ్రతలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: