ఆ కారణంగానే పెద్ద పెద్ద సినిమాలలో హీరోయిన్స్ ని పెట్టుకునే ముందు చాలా ఆలోచిస్తారు . పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఆ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ నే కరెక్ట్ అంటూ ఆ రేంజ్ హీరోయిన్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు . అయితే ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్స్ కి హీరోయిన్స్ కొరత ఏర్పడింది . ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అంటే అందరు కళ్ళు పెద్దవి చేసి చూసేది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వైపు మాత్రమే . సమంత సినిమాలను ఆపేసింది .
కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంది . రకుల్ ప్రీత్ సింగ్ - పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా తయారయింది. తమన్నా అందాలు బోర్ కొట్టేశాయ్..ఇక శ్రీ లీల - జాన్వికపూర్ లు ఇప్పుడిప్పుడే కెరియర్ లో సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు . శృతిహాసన్ అయితే సినిమా అవకాశాలు వస్తున్నా కూడా రిజెక్ట్ చేస్తుంది. దీంతో ఇప్పుడు అందరికీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారిపోయింది రష్మిక మందన్నా. అయితే ప్రతి సినిమాలోను రష్మికని చూస్తే ఖచ్చితంగా బోర్ కొడుతుంది . అందుకే కొత్త బ్యూటీలను ట్రై చేస్తున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ లు. అయితే అందరికీ అలాంటి అవకాశాలు రావడం లేదు. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్స్ కి హీరోయిన్స్ కొరత ఏర్పడింది . ఇదే వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది..!