టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అదే సంవత్సరం భోళా శంకర్ మూవీ తో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే చిరంజీవి హీరోగా రూపొందిన ఏ సినిమా కూడా 2024 వ సంవత్సరం విడుదల కాలేదు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను ఈ సంవత్సరం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కథను మొదట అనిల్ రావిపూడి చిరంజీవికి వినిపించగా కొన్ని కారణాల వల్ల చిరంజీవిసినిమా చేయను అని చెప్పడంతో దానిని అనిల్ రావిపూడి , వెంకటేష్ తో తీసినట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని రోజుల్లోనే సందీప్ కిషన్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా సినిమా విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా మొదట చిరంజీవిని హీరోగా అనుకున్నట్లు , కానీ చిరు మాత్రం ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమా టీజర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది జనాలు భావిస్తున్నారు. అలా చిరంజీవి ఈ మధ్య కాలం లోనే రెండు సినిమాలను రిజెక్ట్ చేయడం , అందులో ఇప్పటికే ఒక సినిమా బ్లాక్ బాస్టర్ కావడం , మరొకటి మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ఆ సినిమాలను రిజెక్ట్ చేశాడా అని మెగా అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: