టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన నిర్మాతగా కెరియర్ ను ప్రారంభించిన కొత్తలో ఎక్కువ శాతం కొత్త దర్శకులతో సినిమాలను రూపొందిస్తూ వచ్చాడు. ఇక ఆయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయకపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... నేను కొరియర్ ప్రారంభంలో చాలా మంది కొత్త దర్శకులతో సినిమాలు చేశాను.

నా బ్యానర్ లో రూపొందిన సినిమాల ద్వారా దర్శకులుగా పరిచయం అయిన వారు ఎంతో మంది గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఇక నేను కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలి అని అనుకున్నాను. అందులో భాగంగా నేను ఆ సమయం లో స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వి వి వినాయక్ , శ్రీను వైట్ల , ఎస్ ఎస్ రాజమౌళి లతో సినిమాలు చేయాలి అని ప్రయత్నించాను. వి వి వినాయక్ తో సినిమా చేయాలి అని ప్రయత్నించాను కానీ అది కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. ఇక శ్రీను వైట్ల తో కూడా సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశాను అది కూడా కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. ఇకపోతే రాజమౌళి తో సినిమా చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన నాకు ఒక గొప్ప మాట చెప్పాడు.

నేను రాజమౌళి దగ్గరికి సినిమా కోసం వెళ్ళినప్పుడు ఆయన మీరు ఎంతో మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తున్నారు. మీ ద్వారా ఎంతో మంది కి గొప్ప జీవితం దక్కుతుంది. నేను మీతో సినిమా చేస్తే అది మీకు ఒక సినిమా మాత్రమే అవుతుంది. అదే నా సినిమా బదులు మీరు వేరే వారితో సినిమా చేస్తే అది ఒకరికి జీవితాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పాడు. రాజమౌళి చెప్పిన ఆ మాటలు నాకు ఎంతో ఆదర్శంగా అనిపించాయి అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: