తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం కొంత మంది హీరోలు వరస అపజయాలతో డీలా పడిపోయి ఉన్నారు. కచ్చితంగా కొంత మంది హీరోలకు ఇప్పుడు అర్జెంటుగా హిట్టు కావాల్సిన అవసరం ఉంది. లేదంటే వారి కెరియర్ డేంజర్ జోన్ లోకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అలా అర్జెంటుగా హిట్టు కొట్టాల్సిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.

గోపీచంద్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వస్తున్నాయి. దానితో ఈయన తన తదుపరి మూవీ తో కచ్చితంగా మంచి హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చాలా మంది జనాలు భావిస్తున్నారు.

నితిన్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే నితిన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా నితిన్ కెరియర్ను మంచి దశలో కొనసాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం నితిన్ వరుసగా అపజయాలను అందుకుంటున్నాడు. ఈయన ప్రస్తుతం రాబిన్ హుడ్ , తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ద్వారా అయినా మంచి విజయాన్ని ఈయన అందుకుంటే ఈయన కెరియర్ మళ్ళీ మంచి దశలోకి వస్తుంది అని అభిప్రాయాలను జనాలు వ్యక్తం చేస్తున్నారు.

రామ్ పోతినేని : టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ సమయంలో మంచి స్థాయికి చేరుకున్న నటులలో ఈయన ఒకరు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుసగా అపజయాలను అందుకుంటున్నాడు. మరి ఈయన తన తదుపరి మూవీ తో మంచి విజయాన్ని అందుకుంటే ఇతని కెరియర్ కు ఏ డోకా లేదు అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: