మన తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాలను ఎక్కువ శాతం సంక్రాంతి పండక్కి విడుదల చేయాలి అని భావిస్తూ ఉంటారు. అలా సంక్రాంతి పండక్కు తమ సినిమాలను విడుదల చేసి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోలు అద్భుతమైన విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక టాలీవుడ్ స్టార్ హీరోకు మాత్రం సంక్రాంతి పండగ పెద్దగా కలిసి రాలేదు. ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఐదు సినిమాలు ఇప్పటి వరకు సంక్రాంతి పండక్కు విడుదల కాగా , అందులో ఏకంగా మూడు సినిమాలు ఫ్లాప్ కాగా రెండు సినిమాలు మాత్రమే మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇప్పటివరకు తారక్ నటించిన నా అల్లుడు , నాగ , ఆంధ్రావాలా , అదుర్స్ , నాన్నకు ప్రేమతో సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. ఇందులో నా అల్లుడు , నాగ , ఆంధ్రవాలా సినిమాలు భారీ అంచనాల నడమ విడుదల అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. దానితో ఈ మూడు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్నాయి. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన అదుర్స్ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత తారక్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన నాన్నకు ప్రేమతో అనే సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఐదు సార్లు సంక్రాంతి బరిలో నిలిచిన తారక్ కి రెండు సార్లు మాత్రమే మంచి విజయాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: