చివరకు దర్శకుడు క్రిష్ కూడా మారిపోయాడు. క్రిష్ స్థానంలో ఈ సినిమా నిర్మాత ఏ ఏమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణనే దర్శకుడుగా వచ్చి చేరారు. అసలు సినిమాను ఎప్పుడు షూట్ చేస్తారో..? ఎప్పటికీ అవుతుందో..? ఎప్పుడు రిలీజ్ చేస్తారో..? కూడా అర్థం కావటం లేదు. మార్చి నెలాఖరులో రిలీజ్ అంటూ డేట్ ఇచ్చారు. ఇటీవలే ఒక పాట కూడా విడుదల చేశారు. పవర్ స్టార్ సినిమా వస్తోంది అంటే టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి ఉండాలి.. ఆటో వారం రోజులు.. ఇటో వారం రోజులు గ్యాప్ ఉండాలి.. కానీ హరిహర వీరమల్లు విషయంలో అలా లేదు.
పైగా అదే డేట్‌కు మరో రెండు సినిమాలు ఎనౌన్స్ చేశారు. నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ 2 సినిమాలు వస్తున్నాయని ప్రకటించారు. వీరమల్లు తర్వాత వారం గ్యాప్‌తో సిద్దు జొన్నలగడ్డ జాక్ సినిమా ఉంది. అంటే వీళ్లకు విరమల్లు అంటే చాలా లైట్ తీసుకున్నారా.. అసలు ఆ డేట్ కి ఈ సినిమా రాదని నమ్మకమా.. వచ్చిన పర్వాలేదు అన్న కాన్ఫిడెన్స్ వీరిలో ఉందా ? అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఈ సినిమాపై బజ్ లేదు అన్నది వాస్తవం. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్, అలాగే జాక్వాలిన్ ఫెర్నాండేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.