- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సంక్రాంతి వస్తున్నాం. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రీమియర్ షో ల‌ నుంచి పండగ మూడు రోజులు .. ఇక వారం రోజులు పూర్తవుతున్న కూడా ఎక్కడా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వసూళ్లు జోరు తగ్గటం లేదు. రోజురోజుకు సాలిడ్ వసూళ్లతో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 175 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టింది. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా అద్భుతమైన ఘనత సాధించింది. వెంకీ కెరీర్ లోనే నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అన్నట్టుగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ మైలురాయి దాటి వెంకీ కెరియర్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడున్న కలెక్షన్లను బట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాబోయే రోజుల్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఉంది.


ఈ సినిమాలో మీనాక్షి చౌదరి - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. రిలీజ్ కి ముందు నుంచే దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో చేసిన బలమైన ప్రమోషన్ల కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్లోకి దూసుకు వెళుతుంది. ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికే సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా ఈజీ గా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తుంద‌ని .. లాంగ్ ర‌న్ లో రు. 300 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించ‌డం ప‌క్కా అని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఏదేమైనా అనిల్ రావిపూడి కెరీర్ లో ఇది మ‌రో మైల్ స్టోన్ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: