కాగా ప్రభాస్ సరసన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేయబోతున్నారు. నయనతార ఏకంగా స్పెషల్ సాంగ్ లో అభిమానులను ఆకట్టుకోనుంది. మారుతి దర్శకత్వంలో రాబోతున్న "ది రాజాసాబ్" సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
కాగా, ఈ సినిమా నుంచి తాజాగా "ది రాజాసాబ్" సినిమాలోని సీన్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సీన్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ ఫైట్ చేస్తున్నట్టుగా ఉంది. మరి ఈ సీన్ రాజాసాబ్ సినిమాలోదేనా లేదా అనే డౌట్ తో కొంతమంది అభిమానులు ఉన్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన ప్రభాస్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ ఫోటోలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదిలా ఉండగా.... ఇప్పటివరకు చిన్న సినిమాలకే దర్శకత్వం వహించిన మారుతీ ఏకంగా ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమా తీయబోతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. ఇక డైరెక్టర్ మారుతీతో సినిమా చేయడంతో ప్రతి ఒక్కరి చూపు ది రాజాసాబ్ సినిమా పైన పడింది.