సినిమాలు కంటెంట్ పరంగా చూస్తే గేమ్ చేంజర్ , వినయ విధేయ రామ కంటే బాగుంది .. కానీ రెండిటికి సమానమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి .. ఇప్పుడు ఈ విషయం కాస్త పక్కన పెడితే గేమ్ చేంజర్ ఎందుకు వినయ విధేయ రామ లాగా సక్సెస్ కాలేక పోయింది? ఎక్కడ పొరపాటు జరిగింది అనేది ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక వినయ్ విధేయ రామ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి .. హీరోని ఎలివేట్ చేస్తూ చాలా సన్నివేశాలు ఉన్నాయి .. అలాగే భారీ యాక్షన్స్ సన్నివేశాలు ఈ సినిమాకి బలం .. అలాగే గేమ్ చేంజర్ సినిమాలో అలాంటివి అసలు ఏమీ లేవు .. కేవలం పొలిటికల్ సబ్జెక్టు మీదే సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది . ఒకటంటే ఒక హైప్ ఇచ్చే సన్నివేశం కూడా సినిమాలో కనిపించదు .. ఒక ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం కొంత పరవాలేదు అనిపించింది .. కానీ ఆ తర్వాత మొత్తం సినిమా ఫ్లాట్ గానే ఉంటుంది.
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కావాలంటే హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశాలు కనీసం మూడు , నాలుగైన ఉండాలి .. అప్పుడే డిజాస్టర్ టాక్ వచ్చిన ఇలాంటి పండగ సమయంలో మినిమం కలెక్షన్లు వస్తాయి . ఇక వినయ విధేయ రామ సినిమాలో అవి పుష్కలంగా ఉన్నాయి .. ఇక గేమ్ చేంజర్‌లో అలాంటివి లేవు .. అందుకే ఈ రెండు సినిమాలు మధ్య ఇంత తేడా ఏర్పడింది .. గత సంక్రాంతికి వచ్చిన మహేష్ గుంటూరు కారం సినిమా కూడా వినయ విధేయ రామ కోవలోకి వస్తుంది. ఈ సినిమాల బట్టి సంక్రాంతికి ఒక సినిమా ఆడాలంటే ఏవి ఉండాలో అవన్నీ ఉన్నాయి .. అందుకే ఈ సినిమా కూడా 70 శాతానికి పైగా రికవరీ తెచ్చుకుంది.. ప్రెసెంట్ ఈరోజుకి గేమ్ చేంజర్ 110 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి .. ఇది దాదాపు క్లోజింగ్ కలెక్షన్ లెక్కని కూడా చెప్పవచ్చు.