చందు మొండేటి డైరెక్టర్. ఈ క్రేజీ కాంబినేషన్ సముద్రం బ్యాక్ డ్రాప్, మంచి ప్రేమ కథ. అందుకే నిర్మాత బన్నీ వాస్ కథను విపరీతంగా నమ్మారు. సినిమాకు రెమ్యునరేషన్‌ల కే దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేశారు. సిజి పనులు ఉన్నాయి. చాలా వర్కింగ్ డేస్ నడిచాయి. సినిమా సగం వరకు వస్తే తప్ప ఖర్చు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ అవుతుందని వాళ్లకు అర్థమైంది. అయినా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. ధైర్యంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్లారు. నాగచైతన్య మార్కెట్ సంగతి అలా ఉంచితే.. సాయి పల్లవి క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. పైగా ఇటీవల అమరాన్ సినిమా దెబ్బకు ఆమె సౌత్ ఇండియాతో పాటు జాతీయ స్థాయిలో బాగా పాపులర్ అయింది.
ఇప్పుడు థియేట్రికల్, నాన్ ధియేట్రికల్ కలిసి పెట్టిన బడ్జెట్ కు మ్యాచ్ అవ్వాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ధియేటర్ బిజినెస్ రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు ఆశిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. మిగిలినవి రావాల్సి ఉంది. అలాగే ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమాకు మరింత బజ్ వస్తుందన్న నమ్మకం అయితే బన్నీవాస్‌లో బాగా కనిపిస్తోంది. అందుకే ఈ సినిమా మీద భారీగా బెట్టింగ్ ఆడుతున్నాడు అన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.