ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పా2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎవరికి సాధ్యం కానీ రికార్డులు అందుకుంటూ ఇండియన్ సినిమా చరిత్రలోనే అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా అప్పట్లో సంధ్య 70ఎంఎం ధియేటర్లో కోటి 58 లక్షల  గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది .. ఈ రికార్డు దాదాపు పాతికేళ్ళు పదిలంగా ఉంది .. ఈ మధ్యలో ఎన్నో  బ్లాక్ బస్టర్  సినిమాలు వచ్చాయి .  పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి .. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఈ థియేటర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది .. అలాంటి రికార్డులన్నీ పుష్పా 2 సినిమా గత నెలలో బద్దలు కొట్టింది .. ఇప్పుడు 16 ఏళ్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులను కూడా పుష్పరాజ్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
 

2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ యమదొంగ సినిమా 400 కేంద్రాల్లో అర్థశత దినోత్సవాన్ని జరుపుకుంది .. ఇప్పటివరకు ఈ రికార్డుని ఎవరూ టచ్ చేయలేకపోయారు .. ఓటీటీ యుగం మొదలయ్యాక అసలు 50 రోజులు 100 రోజులు రికార్డులు ప్రేక్షకులు మర్చిపోయారు .. ఇలాంటి రోజుల్లో కూడా పుష్పా2 సినిమా 50 రోజుల కేంద్రాల విషయంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది .. టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌ గా మొత్తంగా 500 కేంద్రాలు 50 రోజులను పూర్తిచేసుకుందని తెలుస్తుంది .. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 థియేటర్లలో 50 రోజులు ఆడిందట .. రీసెంట్గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల అన్నిటిలో పుష్పా2 సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో బద్దలు కొట్టడం చాలా కష్టం.

 

అలాగే రీసెంట్ గానే ఈ సినిమాకు 20 నిమిషాల అదనపు ఫుటేజీ ని  జత చేసి మరోసారి థియేటర్లో విడుదల చేశారు . అలాగే బుక్ మై షో లో ఈ సినిమాకి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ని చూస్తుంటే 100 రోజులు కూడా ఇలాగే ఆడేలాగా కనిపిస్తుంది .. రోజుకి సగటు 30 వేల టికెట్లు 40 రోజులు దాటిన తర్వాత కూడా అమ్ముడుపోతున్నాయంటే సాధారణ విషయం కాదు .. ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ ఊహించిందే కానీ ఈ స్థాయిలో  సక్సెస్ అవుతుందని మాత్రం ఎవరూ కలలో కూడా ఊహించలేదు .. ఇంతటి స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందంటే కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి .. అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కుతుందని అందరూ అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: