విజయ రంగరాజు అసలు పేరు రాజ్ కుమార్ అయినప్పటికీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరును మార్చుకున్నారట. మొదట ఈయన మద్రాసులో రంగస్థలం కళాకారునిగా కూడా పలు రకాల నాటకాలను వేస్తూ ఉండేవారట.ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మలయాళం ,తమిళం వంటి భాషలలో కూడా నటించారట. ఎన్నో చిత్రాలలో విలన్ గా , సహాయ నటుడిగా కూడా నటించారట. డైరెక్టర్ బాబు దర్శకత్వంలో వచ్చినటువంటి శీతాకాలం అనే సినిమాతో మొదటిసారిగా నటుడుగా ఎంట్రీ ఇచ్చారట.
కానీ బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమాలో ఈయన నటనకు ప్రశంసలు అందుకునేలా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నటించిన నటుడు రంగరాజుకి గుర్తింపు రాలేదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం హీరో గోపీచంద్ నటించిన యజ్ఞం సినిమాలో విలన్ గా నటించారు .ఈ సినిమాతో మరొకసారి మంచి విజయాన్ని అందుకున్న నటుడు రంగరాజు ఆ తర్వాత జాంబిరెడ్డి, విశాఖ ఎక్స్ప్రెస్, డమరుకం తదితర చిత్రాలలో నటించారు. ఇలాంటి నటుడు మరణంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది. ఇక ఈయన అభిమానులు కూడా ఈ నటుడు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారడంతో ఈ నటుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు నెటిజెన్స్.