ఈ సినిమాకు కూడా మంచి వసూళ్లు దక్కాయి. ఎన్ని హిట్లు కొట్టిన గేమ్ ఛేంజర్ నష్టం ఇప్పటిలో పూడ్చడం కష్టం. నిజానికి దిల్ రాజుది మాస్టర్ మైండ్. సినిమా ఫలితం ఎలా వచ్చినా.. ముందు సేఫ్ జోన్‌లో ఉండేలా చూసుకుంటారు. 50 సినిమాలు తీసిన అనుభవం ఆయనది. బడ్జెట్‌ని ఎక్కడ కంట్రోల్ చేయాలని బాగా తెలుసు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో ఆ అనుభవం ఎందుకు పనికి రాలేదు. ఈ సినిమాకు సంబంధించి వేస్టేజ్ ఆయన కంట్రోల్ చేయలేదు. సినిమా బడ్జెట్‌లో 25% వేస్టేజీ ఖాతాలోకి వెళ్లిందని సమాచారం. ఇది చాలా ఎక్కువ మొత్తం ఉంటుందట. శంకర్‌తో ఓ మడత పేచి ఉంది. ఆయన తన సినిమా విషయంలో నిర్మాతలను జోక్యం చేసుకోనివ్వరు.
దానికి ఒప్పుకున్న నిర్మాతే శంకర్‌తో పని చేస్తారు. అయితే ఇటీవల నిర్మాతలు కొంత రాటు దేలారు. లైకా ప్రొడక్షన్ భారతీయుడు 2 సినిమా మొదలుపెట్టే సమయంలో శంకర్ తో అగ్రిమెంట్ చేయించుకుంది. బడ్జెట్ దాటినా, వేస్టేజ్ ఉన్నా, అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కాకపోయినా.. ఆ నష్టాలను శంకర్ భరించాలట. అందుకే భారతీయుడు 2 విషయంలో ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి అగ్రిమెంట్ ఏది దిల్ రాజు శంకర్‌తో చేయించలేదు. ఒకవేళ ఈ అగ్రిమెంట్ జరిగి ఉంటే.. శంకర్ నుంచి దిల్ రాజు ముక్కుపిండి మరీ నష్టం వసూలు చేసేవాడు. కానీ.. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.