ఈ సినిమాలో అనిల్ రావిపూడి దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐశ్వర్య రాజేష్ భార్య పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. మీనాక్షి చౌదరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా నటించింది. కాగా ఈ సినిమాలో మరీ ముఖ్యంగా వెంకటేష్ కు కుమారుడిగా నటించిన బుల్లి రాజు పాత్రకు అభిమానులు కనెక్ట్ అవుతున్నారు.
బుల్లి రాజు అసలు పేరు రేవంత్. తన పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అసలు అనుకోలేదట. సినిమా ప్రీ రిలీజ్ సమయంలో బుల్లి రాజు చాలా కాన్ఫిడెంట్ గా నన్ను గుర్తు పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాడు. తాను చెప్పినట్టుగానే బుల్లి రాజు పాత్ర చాలా అద్భుతంగా ఉంది. సినిమా విడుదలైన అనంతరం బుల్లి రాజుతో ఇంటర్వ్యూలు చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. కేవలం ఓవర్ నైట్ లోనే స్టార్ అయ్యాడు. ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడుతున్నాడు.
ఎక్కడికి వెళ్లినా బుల్లి రాజు చుట్టూ అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇప్పుడు అదే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుందట. వదలండి అంకుల్ అని ఎంతమందిని రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారట. తాజాగా బుల్లి రాజుతో బలవంతంగా ఫోటోలు దిగిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. చిన్నపిల్లలతో అలాంటి చేష్టలు ఎందుకు చేస్తున్నారు. ఈ పైత్యం ఏంటి అని కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.