ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు .. అయితే ఇప్పుడు ప్రభాస్ తో కల్కి సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ . ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి యుద్ధం మొదలైందని వార్తలు బయటకు వస్తున్నాయి .. నిజానికి నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు .. ఇలాంటి ఎంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కల్కి సినిమా రిలీజ్ అయిన సందర్భంలో నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు విషయం ఏమిటంటే రక్తపాతం లేకుండా నేను 1000 కోట్ల మార్క్‌ని అందుకున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ సందీప్ రెడ్డి వంగానే ఉద్దేశించి అని చాలామంది సినీ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని తెలియజేశారు .
ఇక ఎందుకంటే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా 900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు .. ఈ సినిమాలో చాలా యాక్షన్ రక్తపాతంతో కూడిన సన్నివేశాలు ఉంటాయి . మరి ఆ సన్నివేశాలు అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ అలాంటి ట్వీట్ చేశాడంటూ మరికొంతమంది అప్పుట్లో కామెంట్లు చేయడం సంచలంగా మారింది .. ఇప్పుడు ఏదేమైనా కూడా కూల్ గా ఉండేనాగ్ అశ్విన్ , సందీప్ రెడ్డి వంగా మధ్య ఎందుకు డిస్టబెన్స్ వచ్చాయి అనేది తెలియడం లేదు. ఇప్పుడు మొత్తానికైతే వీళ్లిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భోగమనేలా గొడవలు అయితే ఉన్నాయని వారి మాటలతో స్పష్టంగా అర్థమైంది .. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేయాలని అనుకుంటే సందీప్ కంటే ముందే నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2 సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు .. ఇక మరి ప్రభాస్ తో వీరిలో ఎవరు సినిమా ముందు చేస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.