నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే బాలయ్య తర్వాతి తరంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారు ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బాలయ్య అసలు వారసుడిగా మోక్షజ్ఞ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా చాలా ఆలస్యమైంది. అయితే ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉండబోతుందని ప్రకటించారు.ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతాయని అందరూ భావించరు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలకు సంబంధించి వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే అనుకోని విధంగా ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలు రాకపోగా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకోకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని అందరూ భావించారు.

సినిమా ఆగిపోలేదని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరో బిగ్ అప్డేట్ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. అయితే నందమూరి బాలకృష్ణ తన హీరో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.సినిమాలలోకి మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఇలాంటి నేపథ్యంలోనే రామ్ చరణ్తో బాలకృష్ణ చేసిన చిట్ చాట్ కార్యక్రమం లో పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ డెబ్యూ గురించి అడిగారు బాలయ్య.దానిపై పెద్దగా స్పందించని చరణ్, ఆ వెంటనే మోక్ష్ డెబ్యూ ఎప్పుడంటూ రివర్స్ లో బాలయ్యను ప్రశ్నించాడు.ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఫేస్ ఫీలింగ్స్ మారిపోయాయి.నవ్వుతూనే అతి త్వరలో అనేశారు.నిజంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే సినిమా ఉంటే బాలయ్య వెంటనే ఆ విషయాన్ని అక్కడే చెప్పేసేవారు.కొత్త ముహూర్తం అంటూ టాపిక్ ను కొనసాగించేవారు.కానీ బాలకృష్ణ సమాధానం చూస్తుంటే, మోక్ష్ డెబ్యూ మళ్లీ మొదటి కొచ్చినట్టుంది.మరి ఈ వార్తలన్నింటికీ సమాధానాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: