వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నితిన్ కు ఇప్పుడు ఒక హిట్ కావాలి. దీనికోసమే తనకు ‘భీష్మ’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుమలను నమ్ముకుని ‘రాబిన్ హుడ్’ అన్న మూవీ చేశాడు. వాస్తవానికి ఈమూవీ డిసెంబర్ 25న విడుదల కావలసి ఉంది. అయితే ‘పుష్ప 2’ మ్యానియాతో ధియేటర్లు హోరెత్తిపోతున్న విషయాన్ని గ్రహించిన నితిన్ తన మూవీని సంక్రాంతి రేస్ లో విడుదల చేయాలని భావించాడు.



అయితే ధియేటర్ల కోరాత ఏర్పడటంతో నితిన్ ఆలోచనలు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మార్చి 28న ‘ఉగాది’ కానుకగా విడుదల చేయాలని ఈ మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం మార్చి 28న పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఆ మూవీ నిర్మాతలు చాల కాలం క్రితమే ప్రకటన ఇచ్చరు.



దీనికితోడు సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటను యూట్యూబ్ లో విడుదల చేసిన తరువాత పవన్ వీరాభిమనులు ఆపాటను ట్రెండింగ్ గా మార్చిన విషయం తెలిసిందే. దీనితో ‘హరిహర వీరమల్లు’ విడుదల మార్చి 28న ఖాయం అంటూ పవన్ అభిమానులు ఊహాగానాలు ఇప్పటి నుండే మొదలు పెట్టారు. అయితే ఈ హడావుడుల మధ్య నితిన్ ఏధైర్యంతో వస్తున్నాడు అంటూ పవన్ వీరాభిమానులకు సందేహాలు కలుగుతున్నాయి.





అయితే అశలు విషయం వేరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో అనుకున్న ప్రకారం మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ విడుదల సందేహంలో పడింది అంటున్నారు. ఈ లీకులు నితిన్ వరకు వెళ్లడంతో తన మూవీని మార్చి 28న విడుదల చేయమని ఈమూవీ నిర్మాతల పై ఒత్తిడి వచ్చింది అని టాక్..  





మరింత సమాచారం తెలుసుకోండి: