తెలుగు రాష్ట్రాలలో మామూలు మధ్య స్థాయి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాలకు పోటీగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో ఐదవ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల జాబితాల లిస్ట్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండవ స్థానానికి చేరుకుంది. దీంతో ఈ సినిమా విజయం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమా ఐదవ రోజు 12.75 కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాప్-2 స్థానంలో నిలిచింది.
ఇది బహు భాషా సినిమాలతో పాటు భారీ బడ్జెట్ ప్రాజెక్టులను అధిగమించి ఈ స్థాయికి చేరడం నిజంగా సాధారణ విషయం కాదు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన బాహుబలి 2, కల్కి 2 కలెక్షన్ల కన్నా హై రేంజ్ లో ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. ఈ విషయం తెలిసి వెంకటేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు.