తాజాగా సాయి పల్లవి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా పేద ప్రజలకు సహాయం చేయడానికి తన దగ్గర అందుకు సంబంధించిన డబ్బు ఉంది అంటూ వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో అడుగుపెడుతున్న సాయి పల్లవి ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొంటూ తన చిన్నతనంలో తమ కుటుంబంలో తామే ధనవంతులను అనుకునేదాన్ని కానీ అప్పుడు మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు.. పేద ప్రజలకు ఇప్పుడు సహాయం చేయడానికి తన దగ్గర తగినంత డబ్బు అయితే ఉందని వెల్లడించింది.
ఈ విషయం విన్న అభిమానులు సాయి పల్లవి డాక్టర్ అయితే కచ్చితంగా అందరికీ మంచి చేయించేలా చూస్తుందని తెలియజేస్తున్నారు. సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.ఇందులో నాగచైతన్య ఒక మత్స్యకారుడుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతూ ఉండడంతో పాటు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమానే కాకుండా సాయి పల్లవి ఒక తమిళ సినిమాలో కూడా నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఒక చిత్రానికి ఐదు కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు టాకు వినిపిస్తోంది.