నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ తో స్టార్ట్ అయిన బాలయ్య విజయాల ప్రస్థానం ఆగలేదు. వరుసగా అఖండ - వీరసింహా రెడ్డి - భగవంత్ కేసరి - డాకూ మహారాజ్ ఇలా వరుస హిట్ల తో దూసుకు పోతోంది. ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమా కు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే సంక్రాంతికి గట్టి పోటీ మధ్య వచ్చిన డాకూ మహారాజ్ సినిమా కు మంచి టాకే వచ్చింది. అసలు ఈ సినిమా కు ఇప్పటి వరకు ఎన్ని వసూళ్లు వచ్చాయి .. ఎంత ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది ? ఎంత వస్తే హిట్టు .. ఆ లెక్కలు ఏంటో చూద్దాం.
డాకూ మహారాజ్ సినిమాకు వరల్డ్ వైడ్ గా రు. 84 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాంగ్ రన్ లో షేర్ పరంగా రు. 105 కోట్లు వస్తే బొమ్మ హిట్ కింద లెక్కే. అదే రు. 84 కోట్ల మధ్య లో ఉంటే అది బ్రేక్ ఈవెన్ .. జస్ట్ యావరేజ్ అనిపించుకుంటుంది. రు. 100 - 105 కోట్లు వస్తే కాస్త లాభాల తో పాటు సినిమా హిట్టు అని చెప్పాలి. అలాగే రు. 131 కోట్లు వస్తే సూపర్ హిట్ కింద లెక్క వేయాలి. ఇక ఫైనల్ రన్ లో రు. 164 కోట్లు షేర్ వస్తే బ్లాక్బస్టర్ హిట్ అని చెప్పాలి.
ఇక ట్రేడ్ వర్గాలు కడుతోన్న లెక్క ప్రకారం చూస్తే డాకూ మహారాజ్ ఫైనల్ రన్ లో గ్రాస్ పరంగా రు . 200 కోట్లు దాటుతుంది అని చెపుతున్నారు.