విజయనిర్మల కుమారుడు సీనియర్ నటుడు నరేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా నరేష్ అంటే పవిత్ర లోకేష్ తో ఆయనకు ఉన్న ప్రేమాయణం గురించి తెలిసిన అనంతరం మరింతగా వార్తల్లో నిలిచారు. ఇప్పటికే నరేష్ రెండు పెళ్లిళ్లు చేసుకొని వారితో విడిపోయారు. ఇదివరకే వివాహం జరిగి తన భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ తో ఎఫైర్ కొనసాగించాడు. వీరిద్దరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.... తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో కూడా నరేష్ సీఎం పాత్రను పోషించి తెలంగాణ యాసలో అదరగొట్టారు. 

నరేష్ వ్యక్తిగత విషయానికి వస్తే.... మొదట అతను రేఖాప్రియ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం విడాకులు తీసుకున్న తర్వాత రమ్య రఘుపతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెను ఆమెకు కూడా 2023లో విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ ని వివాహం చేసుకున్నారు. పవిత్ర లోకేష్ కూడా సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో విపరీతంగా సినిమాలు చేసింది.

అయితే ఇటీవల పవిత్రతో తన రిలేషన్ పై నరేష్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. నటి పవిత్ర వచ్చిన తర్వాత తన జీవితం చాలా మారిపోయిందని నరేష్ వెల్లడించారు. లైఫ్ టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరినట్లు అయిందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు మన జీవితంలో ఉంటే అంతా చాలా బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా తనకు మంచి అనుబంధం ఉందని నరేష్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇదే బంధాన్ని కొనసాగిస్తామని చెప్పారు. తాజాగా యాక్టర్ నరేష్ పవిత్ర లోకేష్ తో తనకు ఉన్న సంబంధంపై నరేష్ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించిన నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లి విజయనిర్మలకు పద్మ అవార్డు రావాలని ఎంతో ప్రయత్నం చేశానని చెప్పాడు. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంతో ప్రయత్నించారని నరేష్ గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: