- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో నడుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నటిస్తున్న కాస్టింగ్ పై ఎలాంటి అధికారికి సమాచారం లేదు. అఖండ సినిమాలో బాలయ్యకి జోడిగా నటించిన ప్రగ్య జైశ్వాల్ మాత్రం హీరోయిన్గా ఎంపికైనట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాల్లో 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి ఒక అలనాటి అందాల తార రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇంత‌కు ఆమె ఎవరో కాదు ? అలనాటి మేటినటి శోభన. యంగ్ ఏజ్ లో కోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ లో తన అందం అభినయంతో అలరించిన స్టార్ హీరోయిన్ శోభన.


ఆమె 18 ఏళ్ల గ్యాప్ తర్వాత గత ఏడాది వచ్చిన యంగ్ రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాలో మరియం అనే పాత్రతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెతో సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శోభన సన్యాసిని పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. శోభన గతంలో బాలయ్యతో నారీ నారీ నడుమ మురారి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శోభన - బాలయ్య కలిసి నటిస్తుండడంతో అంచనాలు మామూలుగా లేవు.


ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ కోసం మేము ఇక్కడికి వచ్చాం అని.. అఘోరాల నేప‌థ్యంలో సాగే కథ ఇది .. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తాం జనవరి 11 నుంచి ఇక్కడ ఉన్నామని నాగ సాధువులు ... అఘోరాలను కలిసి మా ప్రయత్నం లోపం లేకుండా సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల శ్రమిస్తున్నట్టు బోయపాటి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: