- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి యావరేజ్ సినిమా ఇచ్చారు. త్వరలోనే మహేష్ బాబు 29వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో ఎప్పుడు ఎప్పుడు సినిమా వస్తుందా ? అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సినీ ప్రేమికుల కోరిక‌ ఎట్టకేలకు తీరబోతోంది. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత డాక్టర్ కే ఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేష్ బాబు - క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. 2014 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.


సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా మాత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉంది. ఆ సినిమా కూడా మహేష్ చేసి ఉంటే అది కూడా పెద్ద డిజాస్టర్ సినిమా అయ్యి ఉండేది. ఆ సినిమా ఏదో కాదు రామ్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా జగడం. ఆర్య సూపర్ హిట్ అయ్యాక జగడం సినిమాను దిల్ రాజు నిర్మాతగా తెర‌కెక్కించాలని సుకుమార్ అనుకున్నారు.


అయితే కథలో మార్పులు చేయాలని దిల్ రాజు చెప్పడంతో అది సుకుమార్ కు నచ్చలేదు. ఆ టైంలో మహేష్ బిజీగా ఉండడంతో ఒక రాత్రికి రాత్రి హీరో రామ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి వెంటనే ఓకే చేయించుకుని మరుసటి రోజు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు సుకుమార్. చివరకు జగడం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఒకవేళ మహేష్ బాబు ఈ సినిమా కూడా చేసి ఉంటే సుకుమార్ తో రెండు డిజాస్టర్లు చేసిన హీరో అయి ఉండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: