టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ‘తండేల్’ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఆ తరవాత… కార్తీక్ దండు సినిమాని పట్టాలెక్కిస్తాడు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘ విరూపాక్ష ’ సినిమాతో ఆకట్టుకొన్నాడు కార్తీక్ దండు. ఈసారి కూడా ఓ మిథికల్ థ్రిల్లర్ కథను రెడీ చేసుకుని సినిమా గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా లో చైతుకు జోడీగా కథానాయికగా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నారు. అయితే.. ఆ తరవాత మీనాక్షి చౌదరి స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది. మీనాక్షి చౌదరి - నాగచైతన్య కాంబో ఫ్రెష్‌గా ఉంటుందని ఆమెని తీసుకోవాలని ముందుగా అనుకున్నారు. అయితే రెమ్యునరేషన్ మ్యాటర్ లో ఇద్దరి మధ్య కాస్త పేచీ వచ్చిందని మీనాక్షి ని సినిమా నుంచి పక్కన పెట్టారు. ఆ తరవాత శ్రీలీలని అనుకొన్నారు.
కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక విరూపాక్ష సినిమాలో సుకుమార్ హ్యాండ్ వుంది. ఆయన ఓ వాటాదారు గా కూడా ఉన్నారు. ఇక చైతు కొత్త సినిమా విషయంలోనూ సుక్కు జోక్యం చేసుకొంటున్నారని అంటున్నారు. అలాగే సుక్కు రీ సెంట్ గా డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప 2’ కోసం శ్రీలీల ఓ ప్రత్యేక గీతం చేసింది. అప్పుడే చైతు కు జోడీగా శ్రీలీల అయితే బాగుంటుందని సుకుమార్ సలహా ఇచ్చారట.
ఈ క్రమంలో నే మీనాక్షిని పక్కన పెట్టి ... శ్రీలీలని తీసుకొన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీలీల డేట్లు కాస్త డైలామాలో పడ్డాయి. అఖిల్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా డేట్లతో చైతూ డుట్లు క్లాష్‌లో పడ్డాయట. దాంతో.. శ్రీలీలని పక్కన పెట్టి మళ్లీ మీనాక్షినే తీసుకొందామా ? అన్న ఆలోచన లో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో మీనాక్షి కాస్త తగ్గాల్సివుంటుంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్టు తరవాత మీనాక్షి తన రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ ?