ఇష్టం సినిమాతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరన్ ప్రస్తుతం సౌత్ లో సినిమాలు అయితే బాగా తగ్గించేసింది.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ సరసన ఆ సినిమాలో ఒక చిన్న రోల్ పోషించింది. అజయ్ దేవగన్ భార్య పాత్రలో నటించిన శ్రియకి మళ్ళీ తెలుగులో ఎక్కువగా సినిమా ఆఫర్స్ అయితే రాలేదు. అయితే అలాంటి శ్రియా గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ హీరో తో శ్రియా డేటింగ్ లో ఉండి ముంబైలో ఐదేళ్లపాటు ఒకే ఇంట్లో కలిసి ఉన్నారంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ శ్రీయా ఎవరితో డేటింగ్ లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు మధ్య ఇలాంటి ఎఫైర్ వార్తలు కామన్.

అలా శ్రీయా శరణ్ కూడా గతంలో ఓ బడా ఫ్యామిలీకి చెందిన హీరోతో డేటింగ్ చేసిందట. అది కూడా దాదాపు 5 సంవత్సరాలు.. శ్రియ శరన్ కి ఆ హీరో ఒక పార్టీలో కలిశారట. ఆ పార్టీలో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి అది కాస్త రిలేషన్ కి దారితీసి దాదాపు 5 సంవత్సరాలు ముంబైలో ఓకే ఫ్లాట్లో కలిసి ఉన్నారట. అయితే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నప్పటికీ ఆ హీరో తండ్రి మాత్రం శ్రియా శరన్ తో పెళ్లికి ఒప్పుకోలేదట. అయితే ఆ హీరో ఇండస్ట్రీలోకి రాకముందు కొన్ని సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా కూడా పనిచేసినట్టు తెలుస్తుంది.

మరి ఆ హీరో ఎవరో తెలియాల్సి ఉంది. ఇక శ్రియా శరన్ కరోనా లాక్ డౌన్ సమయంలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లయిన చాలా రోజులకు తనకు పెళ్లి జరిగిన విషయాన్ని బయట పెట్టింది. ఇక ఈ జంటకు ఓ పాప కూడా ఉంది.అలా శ్రీయా శరన్ అవకాశాలు వచ్చినప్పుడల్లా సౌత్ లో కనిపిస్తూ ప్రేక్షకులను పలకరిస్తూ పోతుంది.ఇక ఈ హీరోయిన్ కి అవకాశాలు లేకపోయినప్పటికీ తన అందమైన ఫోటోలతోనే సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: