టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ . ఈ సినిమా ఈ సంక్రాంతి కి మూడు పెద్ద అంచనాలు ఉన్న సినిమాల మధ్య లో పోటీగా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అటు మెగా హీరో .. మెగా పవర్ స్టార్ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ .. టాలీవుడ్ ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ తో పాటు అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా - డైరెక్టర్ బాబి కాంబినేషన్లో డాకూ మహారాజ్ సినిమా తో పాటు వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల పోటీలో వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేసింది.
ఇక ఏపీ & తెలంగాణ లో 6 వ రోజు ఈ సినిమా ఏకంగా రు. 12.5 కోట్ల + షేర్ తో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా గా రికార్డులకు ఎక్కింది. ఓవరాల్ గా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సూపర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రీమియర్ షో నుంచే ఈ సినిమా కు అదిరిపోయే టాక్ వచ్చింది. ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ సినిమా 6వ రోజు కలెక్షన్లు ఏరియాల వారీగా ఇలా ఉంది.
నైజాం : 4.01 కోట్లు
వైజాగ్ : 2.18 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.92 కోట్లు
ఈస్ట్ : 1.23 కోట్లు
వెస్ట్ : 0.73 కోట్లు
గుంటూరు : 0.89 కోట్లు
కృష్ణ : 0.93 కోట్లు
నెల్లూరు : 0.39 కోట్లు
--------------------------------
ఏపీ + తెలంగాణ లో 6వ రోజు కలెక్షన్లు రూ. 12.5 కోట్లు వచ్చాయి .. ఇక వరల్డ్ వైడ్ గా 6వ రోజు షేర్ విషయానికి రూ.16.12 కోట్లు వచ్చాయి.