గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ బ్యూటీ కియార అద్వాని కాంబినేషన్ ప్రేక్షకులను ఎందుకు సరిగ్గా మెప్పించలేక పోతుంది .. రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఎలాంటి టాక్ తెచ్చుకుందు అందరికీ తెలిసిందే .. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది .. అలాగే ఈ సినిమా కన్న ముందు చరణ్ కియార వినయ్ విధేయ రామా లోనూ కలిసి నటించారు .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టింది.


ఈ విధంగా చరణ్ కియారా కలిసి నటించిన రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు గానే మిగిలాయి .. దీంతో ఇప్పుడూ ఈ ఇద్దరి కాంబినేషన్ ఇకపై మరో సినిమాను రిపీట్ చేయకపోవటమే మంచిదని సిని విశ్లేషకులు అంటున్నారు .. నిజానికి గేమ్ చేంజర్ కి హీరోయిన్ గా కీయారాని ఎంపిక చేసినప్పుడే ఇది ఒక బ్యాడ్ డెసిషన్ గా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది .  వినయ విధేయ రామతో ప్లాప్ కాంబినేషన్ అనే ముద్ర వేసుకున్న కూడా శంకర్ ప‌ట్టు బ‌ట్టి మరి కీయారని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు.


ఇక దీంతో మెగా అభిమానుల నుంచి కొంత‌ అసంతృప్తి వచ్చినా కూడా శంకర్ వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడు .. కట్ చేస్తే ఫలితం ఏమైందో అందరికీ తెలిసింది .. ఓ సినిమా ప్లాఫ్ కి కర్ణుడి చావు తరహా కారణాలు ఎన్నో ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి .. అయినా ఇదంతా గతం గతః . కానీ గత అనుభవాల నుంచి ఏం నేర్చుకున్నావ్ అన్నది ఎంతో ముఖ్యం .. మరి ఈ ప్లాప్ శంకర్ లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందో చూడాలి. అలాగే కీయార టాలీవుడ్ లో భరత్ అనే నేను సినిమాతో అడుగుపెట్టింది .. అందులో మహేష్ కి జంటగా నటించింది ఈ సినిమా మంచి విజయ అందుకుంది .. ఈ సినిమాలో కీయార పాత్ర ఎంతో బలమైన పాత్ర పోషించింది మొదటి సినిమాతోనే తన నటనకు ఆస్కారం ఉన్న రోల్ లో నటించింది .. నటిగా ఎన్నో విమర్శలు ప్రశంసలు అందుకుంది .. కానీ తర్వాత నటించిన రెండు సినిమాలు తెలుగులో ఆమెకు నిరాశ మిగిల్చాయి. ఇక మరి రాబోయే రోజుల్లో కియారకు టాలీవుడ్ లో మంచి విజయం వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: