గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మెగా అభిమానులను తీవ్ర నిరాశపరిచింది .. 10 తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది .. ఓపెనింగ్ డే కలెక్షన్స్ పై భారీ ట్రోలింగ్ జరిగిన తర్వాత మూవీ టీమ్ అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు .. ఇక ఇదే క్రమంలో డాకు మహారాజ్ ,  సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు పండగ సెలవులను బాగా క్యాష్ చేసుకున్నాయి .. సెకండ్ వీకెండ్ లోను ఈ సినిమాలు గట్టిగా డామినేషన్ చూపించాయి .. ఈ సంగతి పక్కన పెడితే మెగా మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్ గా మారటానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసింది .. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైనా ఫంక్షన్‌కు గెస్ట్ గా వస్తే ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్లాఫ్ అవుతాయని టాలీవుడ్ లో ఉన్న యాంటీ అభిమానులు వాదిస్తున్నారు .. గతంలో కూడా అంటే సుందరానికి , రిపబ్లిక్ , సైరా నరసింహారెడ్డి , నా పేరు సూర్య నాఇల్లు ఇండియా, నేల టికెట్ , చల్ మోహనరంగా వంటి సినిమా ఈవెంట్స్ కు పవన్ ముఖ్య అతిథిగా వచ్చారని ఆ సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయని వారు ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు .. అదే సెంటిమెంట్ గేమ్ చేంజర్‌ సినిమాకు మరోసారి రిపీట్ అయిందని వారు వాదిస్తున్నారు.


ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ రావడం వల్ల సినిమా ప్లాఫ్ అయిందనే వాదన కరెక్ట్ కాదని .. గతంలో ఆయన గెస్ట్ గా వచ్చిన జులాయి , ఇష్క్, అ ఆ ,  నాయక్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించాయి .. అలాగే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల ఈవెంట్ లోను చిరంజీవితో కలిసి పవన్ పాల్గొన్నారు .. కాబట్టి పవన్ గెస్ట్ గా వస్తే సినిమాలు ప్లాప్‌ అవుతాయని వాదనలో ఎలాంటి నిజం లేదు .. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈవెంట్ కు రాకుండా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుందా? ప్రేక్షకులకు నచ్చే సినిమా అయితే వారు తప్పకుండా ఆ సినిమాను ఆదరిస్తారు .. సినిమా వారికి నచ్చకపోతే ఎంత హడావుడి చేసినా థియేటర్లకు రారు .. పైన చెప్పకున్న‌ సినిమాలు విషయంలోను ఇదే జరిగింది .. సినిమా కథ నచ్చలేదు కాబట్టే ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రాలేదు .. కాకపోతే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పాల్గొన్న తొలి సినిమా ఫంక్షన్ కావడంతో గేమ్ చేంజర్ రిజల్ట్ చూసి అభిమానులు ఎక్కువగా డిసప్పాయింట్ అవుతున్నారు .. గతంలో మర్చిపోయిన అజ్ఞాతవాసి గాయాన్ని మరోసారి గుర్తు చేసిందని మెగా అభిమానులు బాధపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: