అలాగే కార్తికేయ సినిమాలతో పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకున్న నిఖిల్ కూడా అదే జోరు కంటిన్యూ చేస్తున్నారు .. స్పై మూవీ అంతగా మెప్పించ లేకపోయినా .. ప్రజెంట్ మరో పాన్ ఇండియా సినిమాని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నాడు .. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న స్వయంభు, ది ఇండియా హౌస్ సినిమాలతో బాలీవుడ్ మార్కెట్లో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ఈ యంగ్ హీరో తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు . అలాగే మరో యంగ్ హీరో అడివి శేష్ కూడా నార్త్‌లో తన సత్తా చాటేందుకు తెగ ఆరాటపడుతున్నాడు .. అడివి శేష్ కూడా 2025 మీద తెగ అంచనాలు పెట్టుకున్నారు .. గూడచారి సీక్వల్ గా రాబోతున్న జీ2 సినిమాతో హిందీ మార్కెట్లో మరోసారి తానేంటో చూపించాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు.
విరూపాక్ష తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకుని డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్నాడు మెగా హీరో సాయి ధరంతేజ్ కూడా .. సంబరాల ఏటిగట్టుతో పాన్ ఇండియా లెవెల్ లో తానేంటో ప్రూవ్ చేసుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. అలాగే అక్కినేని హీరో నాగచైతన్య కూడా 2025 లోనే పాన్ ఇండియా హీరోగా అడుగుపెడుతున్నాడు .. చందు మొండేటి దర్శకత్వంలో తండెల్ సినిమాతో ఈ యంగ్ హీరో ప్రేక్షకుల ముందుగా పాన్ ఇండియా వార్ లో దిగిపోతున్నాడు.. వచ్చే ఫిబ్రవరిలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ యంగ్ హీరోలు 2025 లో పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.