ఇంతకు ఈ బ్యూటీ ఎవరు .. ఎందుకు ఆమె స్కూల్‌కి వెళ్తుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ చాలామంది హీరోయిన్లు సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేస్తున్నారు .. అలాంటి వారిలో మందనా కరిమి కూడా ఒకరు .. ఇక ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ నుంచి హీరోయిన్గా అడుగు పెట్టింది .. ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది .. అలా పలు సినిమాల్లో నటించిన తర్వాతే ఈ హీరోయిన్ ఆ తర్వాత సినిమాలు మానేసి. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగా ఊహించని విధంగా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయింది . ఇప్పుడు తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె తను సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చెప్పుకు వచ్చింది.
ఆ ఈవెంట్లో మందనా కరిమి మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని సినిమాలు చేయాలని భావించలేదని ఆమె చెప్పకు వచ్చింది .. చిన్న వయసులోనే తాను మోడలింగ్లో అడుగు పెట్టాను ఆర్థిక పరిస్థితుల కారణంగా నేను చదువును పూర్తి చేయలేకపోయాను. నేనెప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు .. అలా చేయడం నాకు ఇష్టం కూడా లేదు .. కానీ సినిమాలు చేశాను .. అందులో నన్ను అందరూ ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను .. అలాగే నాకు ఇంటీరియర్ డిజైనింగ్ పై నాకెంతో ఆసక్తి కలిగింది. ఓ స్నేహితురాలి కారణంగా నేను ఇంటీరియర్ డిజైనింగ్ పై ఆసక్తి పెంచుకున్నాను .. ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ కోసం పూర్తిగా ఆ పనిలో మునిగిపోయాను ఇప్పటికే నాకు సినిమా ఆఫర్స్ ఇస్తున్నారు .. కానీ నేను వాటికి నో చెప్తున్నాను .. ఇప్పటికీ కూడా తను డిజైనింగ్ కోర్స్ స్కూల్‌కు వెళుతున్నానని మందన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.